బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు.
తెలంగాణ, 8 మార్చి (హి.స.) బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు హైదరాబాదులో మాట్లాడుతూ ఆయన అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. దేశంలో చాలా తక్కువ శాతం ఉన్న మతాల పరిస్థితి ఉందని
సిపిఐ నారాయణ


తెలంగాణ, 8 మార్చి (హి.స.)

బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు హైదరాబాదులో మాట్లాడుతూ ఆయన అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. దేశంలో చాలా తక్కువ శాతం ఉన్న మతాల పరిస్థితి ఉందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం భయందోళనలో ఉందని ఆరోపించారు. బీజేపీ కసాయి వారిలాగా ప్రవర్తిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

మనం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం.. మోడీ సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande