తయారీరంగ యూనిట్స్ ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది ప్రధాని మోదీ ఆలోచన.. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
తెలంగాణ, మహబూబ్నగర్. 8 మార్చి (హి.స.) రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల కోసం బ్యాటరీలు తయారు చేసే మూడు క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద అమర రాజా బ్యాటరీ కంపెనీ గిగా పరిశ్ర
కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్


తెలంగాణ, మహబూబ్నగర్. 8 మార్చి (హి.స.)

రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల కోసం బ్యాటరీలు తయారు చేసే మూడు క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద అమర రాజా బ్యాటరీ కంపెనీ గిగా పరిశ్రమకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు అశ్వనీ వైష్ణవ్ రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన.. తయారీరంగ యూనిట్స్ ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది ప్రధాని మోదీ ఆలోచన అన్నారు. తెలంగాణలో 3 తయారీ రంగ క్లస్టర్స్ కి కేంద్రం సహకారం అందిస్తోందని అందులో ఒకటి దివిటిపల్లిలో ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీ కంపెనీ భూమి పూజకు ఇవాళ వెళ్తున్నానని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహకారం అందిస్తున్నాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande