ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును దేశ ప్రధమ పౌరురాలిగా చేసిన పార్టీ బీజేపీ.. బండి సంజయ్.
తెలంగాణ, 8 మార్చి (హి.స.) అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 'అమ్మవారి శక్తి స్వరూపాలు.. సృష్టికి మూల కారకులు.. కుటుంబాన్ని, సమాజాన్ని కం
బండి సంజయ్


తెలంగాణ, 8 మార్చి (హి.స.)

అంతర్జాతీయ మహిళా దినోత్సవ

సందర్భంగా మహిళలందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 'అమ్మవారి శక్తి స్వరూపాలు.. సృష్టికి మూల కారకులు.. కుటుంబాన్ని, సమాజాన్ని కంటికి పాపలా కాపాడుతున్న స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టిలో ఏమీ ఆశించకుండా పిల్లల ఎదుగుదలకు జీవితాన్నే త్యాగం చేసేది తల్లి మాత్రమే. అక్కా చెల్లెళ్ల రూపంలో, భార్యగా తోడునీడగా నిలిచేది స్త్రీ మూర్తులే.. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు' అని పేర్కొన్నారు.

'మహిళా దినోత్సవం నాడు మాత్రమే మహిళలను పొగిడి.. ఆ తరువాత వారిని విస్మరించే పార్టీ బీజేపీ కానేకాదు. స్త్రీలను లక్ష్మీ, సరస్వతి, దుర్గామాతగా పూజించే పార్టీ బీజేపీ. ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును ఈ దేశ ప్రధమ పౌరురాలిగా చేసిన పార్టీ బీజేపీ అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande