మహిళల అభివృద్ధికి, రక్షణకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది.. కిషన్ రెడ్డి
తెలంగాణ, 8 మార్చి (హి.స.) అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా
కిషన్ రెడ్డి


తెలంగాణ, 8 మార్చి (హి.స.)

అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల

స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని

మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా

ఆయన మాట్లాడారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని.. మహిళల అభివృద్ధికి,

రక్షణకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు.భూగర్భం ఖనిజాల వెలికితీత నుంచి వినీలాకాశంలో

ఫైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాలలో మహిళలు చరిత్ర

సృష్టిస్తున్నారని... ఏ రంగంలో మహిళలకు వివక్షత ఉండకూడదని చెప్పారు. ముందు భాగంలో

నిలబడాలన్నదే మోడీ ఆలోచన అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande