భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ సమరం
న్యూఢిల్లీ, 8 మార్చి (హి.స.) భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమరం జరగనుంది. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమిండియా అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తుంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగకు
ఛాంపియన్స్ ట్రోఫీ


న్యూఢిల్లీ, 8 మార్చి (హి.స.) భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమరం జరగనుంది. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమిండియా అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తుంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగకుండా అజేయంగా దూసుకెళుతుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఎదుర్కొనుంది. ఇక, భారత, న్యూజిలాండ్ క్రికెటర్లు నెట్స్ లో చెమటోడుస్తున్నారు. ఐసీసీ మెగాటోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రాక్టీస్లో రోహిత్ సేన మునిగి తేలింది. కాగా, లీగ్ దశలో న్యూజిలాండ్ను ఓడించిన టీమిండియా అదే రీతిలో ఆదివారం జరిగే ఫైనల్ పోరులోనూ సత్తాచాటాలని భావిస్తుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్లన్నీ దుబాయ్స్ ఆడుతుండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande