కర్ణాటకలో దారుణం.. ఇజ్రాయిల్ పర్యాటకురాలిపై గ్యాంగ్ రేప్
కర్ణాటక, 8 మార్చి (హి.స.) కర్ణాటకలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు, హోమ్ స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. టెక్ హబ్ బెంగళూరు నుంచి 350 కి.మీ దూరంలో ఉన్న కొప్పల్ అనే
కర్ణాటకలో దారుణం


కర్ణాటక, 8 మార్చి (హి.స.)

కర్ణాటకలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు, హోమ్ స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

టెక్ హబ్ బెంగళూరు నుంచి 350 కి.మీ దూరంలో ఉన్న కొప్పల్ అనే ప్రాంతంలో తుంగభద్ర ఎడమ ఒడ్డున నక్షత్రాలను చూడటానికి ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. ఒకరు అమెరికన్, ఇంకొకరు ఇజ్రాయెల్కు చెందిన మహిళ ఉన్నారు. గురువారం రాత్రి 11:30 గంటలకు కాలువ దగ్గర నక్షత్రాలను వీక్షిస్తుండగా.. దుండగులు బైక్పై వచ్చినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు.

జరిగిన ఘోరంపై 29 ఏళ్ల హోమ్ స్టే యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగులు తమపై అత్యాచారానికి పాల్పడ్డారని.. అతిథులను కాలువలో తోసేశారని పేర్కొంది. అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ అనే అతిథులు బయటకు రాగలిగారని.. ఒడిశాకు చెందిన బిబాష్ జాడ మాత్రం కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande