తెలంగాణ, హైదరాబాద్. 8 మార్చి (హి.స.)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని వెంగళావు పార్క్ వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమo గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగింది.
కాగా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలతో కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. రేపటి పచ్చదనం కోసం ఒక ఆశను మొక్కల రూపంలో నాటామని, ఈ చిరస్మరణీయ సందర్భంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్