తెలంగాణ, హైదరాబాద్. 8 మార్చి (హి.స.)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి సీతక్క ఎంతోమంది మహిళలకు ఆదర్శమన్నారు. ఆమె జీవితమే ఒక పోరాటం అని చెప్పారు. కింది స్థాయి నుంచి మంత్రిగా ఎదిగారని కొనియాడారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 మందిలో డీసీపీల్లో 8 మంది మహిళా డీసీపీలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో ఇటీవల మహిళా ఎస్ హెచ్ ఓ లను నియమించాం.. కమిషనరేట్లో 18 వేల మంది పోలీసు సిబ్బందిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారు.. ఇవన్నీ మహిళా ప్రోగ్రెస్కు నిదర్శనమని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్