అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం..
తెలంగాణ, హైదరాబాద్. 8 మార్చి (హి.స.)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ఇందిరా మహిళా శక్తి మిషనను ఆవిష్కరించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభనిర్వహించనున
మహిళా దినోత్సవం


తెలంగాణ, హైదరాబాద్. 8 మార్చి (హి.స.)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ఇందిరా మహిళా శక్తి మిషనను ఆవిష్కరించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభనిర్వహించనున్నారు. లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ప్రభుత్వం. అందులో భాగంగా.. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి మిషన్ను ఆవిష్కరించనున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగే ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande