తెలంగాణ, 8 మార్చి (హి.స.)
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టిన కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని
ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో నేడు జరిగిన వేడుకలలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్లు అమలుకానందు వల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యాణా వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. త్వరగా జనగణన చేస్తే.. రాబోయే బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో
మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలవుతారని కవిత పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్