పద్మ విభూషణ్ చిరంజీవి ఉమెన్స్ డే విషెస్
తెలంగాణ, 8 మార్చి (హి.స.) నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్స్ అందరికీ శుభాకాంక్షలు వెల్లువ వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పద్మ విభూషణ్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా మహిళా మణులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన
చిరంజీవి విషెస్


తెలంగాణ, 8 మార్చి (హి.స.)

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్స్ అందరికీ శుభాకాంక్షలు వెల్లువ వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పద్మ విభూషణ్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా మహిళా మణులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో తన భార్య సురేఖ, సీనియర్ హీరోయిన్స్ అయినటువంటి టబు, జయసుధ, మీనా, సుహాసిని, రాధిక కుష్బూ, నదియాలతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ..

నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ బొకే, నమస్కారం చేస్తున్న ఎమోజీలను జోడించాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande