తెలంగాణ, హైదరాబాద్. 8 మార్చి (హి.స.)
హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసు ఆధ్వర్యంలో రన్ ఫర్ యాక్షన్ 2k & 5k రన్-2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమజంలో ఇంకా చిన్న చూపు చూస్తున్నారు.. మహిళలు అంటే సెకండ్ గ్రేడ్ వర్కర్స్ లా చూస్తున్నారని అన్నారు. పురుషులు.. మహిళలు అందరికీ సమానత్వం ఉండాలని ఆమె పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్