భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో విపత్తును చూడలేదు.. మంత్రి ఉత్తంకుమార్
అచ్చంపేట, 8 మార్చి (హి.స.) భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో విపత్తును చూడలేదని, ఎస్ ఎల్ బి సి టన్నెల్లో సంభవించిన విపత్తులో సహాయక చర్యలను, రెస్క్యూ ఆపరేషన్ ను భారత సైన్యం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారు
మంత్రి ఉత్తంకుమార్


అచ్చంపేట, 8 మార్చి (హి.స.) భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో విపత్తును చూడలేదని, ఎస్ ఎల్ బి సి టన్నెల్లో సంభవించిన విపత్తులో సహాయక చర్యలను, రెస్క్యూ ఆపరేషన్ ను భారత సైన్యం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

శనివారం ఆయన దోమలపెంటలోని ఎస్ ఎల్ బి సి టన్నెల్ ను సందర్శించారు. రెస్క్యూ ఆపరేషన్ లో తీసుకుంటున్న సహాయక చర్యలను అధికారులు ఆయనకు నమూనా టన్నెల్ బోర్ మిషన్ ద్వారా వివరించిన అనంతరం టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భారతదేశంలో ఇప్పటి వరకు ఇంతటి భయంకరమైన విపత్తు సంభవించలేదని, కార్మికులను రక్షించడానికి జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, 12 జాతీయ సంస్థలు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయని తెలిపారు. 14 కిలోమీటర్లలో సంభవించిన దుర్ఘటన ప్రాంతానికి 50 మీటర్ల దగ్గర భారీగా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నందున రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టతరంగా మారిందని, రెస్క్యూ టీం సభ్యులకు ప్రాణాపాయం పొంచి ఉన్నందున ఆదివారం నుండి రోబోలను సహాయక చర్యలలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. శనివారం సుమారు 525 మంది సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande