తమిళనాడు, 8 మార్చి (హి.స.)
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే... కేంద్రంపై పోరాటానికి రెడీ అవుతోంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, త్రిభాషా విధానంపై పోరాటం చేసేందుకు డీఎంకే స్పీడ్ పెంచింది. మార్చి 12న తమిళనాడు వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టినట్లు డీఎంకే ప్రకటించింది. అలాగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, త్రిభాషా విధానంపై ప్రజా చైతన్య సభ కూడా నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే డీఎంకేకు పోటీగా త్రిభాషా విధానానికి మద్దతు తెల్పుతు బీజేపీ కూడా పోరాటానికి సిద్ధపడింది. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఇదంతా ఎన్నికల స్టంట్స్ అంటూ టీవీకే పార్టీ తోసిపుచ్చింది. ఈ పోరాటానికి దూరంగా ఉండాలని విజయ్కు చెందిన టీవీకే నిర్ణయం తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..