ఈరోజు,రేపు పోసాని కృష్ణ మురళిని కస్టడీలోకి తీసుకోనున్న నరసరావుపేట పోలీసులు..
ఏ.పీ, 8 మార్చి (హి.స.) పోసానిని రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నరసరావుపేట కోర్ట్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు, ఈరోజు, రేపు రెండు రోజుల పాటు పోసాని కృష్ణ మురళిని నరసరావుపేట పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. పోసాని కృష్ణ మురళి కో
పోసాని కృష్ణమురళి


ఏ.పీ, 8 మార్చి (హి.స.)

పోసానిని రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నరసరావుపేట కోర్ట్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు, ఈరోజు, రేపు రెండు రోజుల పాటు పోసాని కృష్ణ మురళిని నరసరావుపేట పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. పోసాని కృష్ణ మురళి కోరితే.. న్యాయవాది సమక్షంలో అతడ్ని విచారణ చేయాలంటూ పోలీసుకు న్యాయస్థానం సూచించింది.

మరోవైపు, పోసాని కృష్ణ మురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును ఈ నెల 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అయితే, గత ప్రభుత్వంలో పోసాని ఏపీ ఫిలిం టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పని చేశారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణోపాటు వారి కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై పలువురు కంప్లైంట్స్ చేశారు. దీంతో పోసానిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande