పులివెందుల, ఏ.పీ, 8 మార్చి (హి.స.)మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం చేశారు. పులివెందుల భాకరాపురం శ్మశాన వాటికలో దీనిని నిర్వహించారు. మంగళగిరి, తిరుపతి ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం జరిగింది. తన భర్త మృతిపై అనుమానాలున్నాయని రంగయ్య భార్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సందేహాల నివృత్తి కోసం మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..