తెలంగాణ, కామారెడ్డి. 8 మార్చి (హి.స.)
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బాచుపల్లి లో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డి జిల్లా కు చెందిన కేతావత్ నాను(21) హైదరాబాద్ ప్రగతి నగర్ లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీ టెక్ చదువుతూ.. వీఎన్ఆర్ కళాశాల హాస్టల్ లో ఉంటున్నాడు.
తన స్నేహితులు కార్తీక్,విశ్వంత్ లతో కలిసి శనివారం ఉదయం స్కూటీపై బయటికీ వెళ్తున్నాడు. విశ్వంత్ స్కూటి నడుపుతుండగా.. మిగతా ఇద్దరు వెనక కూర్చున్నారు. బాచుపల్లి రహదారి పై వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న కేతావత్ నాను పై నుండి వాహనం వెళ్లడంతో.. అతను అక్కడికక్కడే మరణించాడు. మిగతా ఇద్దరు స్నేహితులు విశ్వంత్, కార్తీక్ లకు స్వల్ప గాయాలు అయ్యాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్