అంతర్జాతీయ.మహిళా.దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా.కా.భద్రత.కై.కొత్త..యాప్
విజయవాడ, 8 మార్చి (హి.స.) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతకై కొత్త యాప్‌ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార
అంతర్జాతీయ.మహిళా.దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా.కా.భద్రత.కై.కొత్త..యాప్


విజయవాడ, 8 మార్చి (హి.స.)

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతకై కొత్త యాప్‌ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆయన.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన ‘శక్తి’ యాప్ ను ప్రారంభించారు.. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా ఆవిష్కరించారు ఏపీ సీఎం..

పలు అధునాతన భద్రతా ఫీచర్లను ఈ “శక్తి” యాప్‌కు జోడించిది ఏపీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌.. మహిళలకు ఆపద కాలంలో అత్యవసర సహాయం అందించేందుకు “శక్తి” యాప్ కీలకంగా పనిచేయనుంది.. వన్ టచ్ SOS బటన్- వెంటనే పోలీసులను అలర్ట్ చేసి సహాయం అందిస్తుంది. - యాప్ ఓపెన్ చేయకుండానే SOS అలర్ట్ పంపించవచ్చు. దీని ద్వారా లైవ్ ట్రాకింగ్ అండ్ ఎవిడెన్స్ షేరింగ్ కాలర్ లోకేషన్, 10 సెకన్ల ఆడియో, వీడియో కంట్రోల్ రూమ్ కి పంపబడుతుంది.. తద్వారా పోలీసు అధికారుల తక్షణమే స్పందించేందుకు దోహదం చేస్తోంది..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande