15వ రోజు కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. పరిహారం విషయంలో నేడు కీలక ప్రకటన చేసే అవకాశం
తెలంగాణ, 8 మార్చి (హి.స.) ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 15వ రోజుకు చేరింది. జీపీఆర్ , క్యాడవర్ డాగ్స్తో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్, మిషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్
ఎస్ఎల్బీసీ


తెలంగాణ, 8 మార్చి (హి.స.)

ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 15వ రోజుకు చేరింది. జీపీఆర్ , క్యాడవర్ డాగ్స్తో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్, మిషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలంలో ఉండి సమీక్ష నిర్వహించారు. మరోసారి టన్నెల్ వద్దకు వెళ్లి టన్నెల్లో రెస్క్యూను పరిశీలించనున్నారు. మరోవైపు.. మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande