తెలంగాణ బిజెపి కీలక నిర్ణయం.. ప్రజా భవన్ వేదికగా నేడు జరిగే సమావేశానికి గైర్హాజరు.
హైదరాబాద్, 8 మార్చి (హి.స.) తెలంగాణ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రజాభవన్ వేదికగా జరిగే సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ ద్వారా తె
తెలంగాణ బిజెపి


హైదరాబాద్, 8 మార్చి (హి.స.)

తెలంగాణ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రజాభవన్ వేదికగా జరిగే సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ ద్వారా తెలియజేశారు. 'ఆహ్వానం ఆలస్యంగా అందింది. ఎంపీల సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం లేదు. పార్టీ కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నాం. భవిష్యత్లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే కాస్త ముందుగా తెలియాజేయాలని కోరుతున్నాను. తెలంగాణ అభివృద్ధి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇకముందూ చిత్తశుద్ధి, అంకితభావంతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటుంది' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande