విజయవాడ, 8 మార్చి (హి.స.) వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి (lకి ఈనెల 20 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీటీ వారెంట్‌పై శనివారం కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ను విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈనెల 20వరకు రిమాండ్ విధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు, వారి కుటుంబసభ్యులు, మీడియా సంస్థలపై దూషణలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంపై జనసేన నేత శంకర్ ఫిర్యాదు మేరకు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
‘‘నాపై అక్రమంగా కేసులు పెట్టారు. ఒకే విధమైన కేసులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారు. నేను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా. గుండె జబ్బు, పక్షవాతం లాంటి రుగ్మతలు ఉన్నాయి’’ అని కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా న్యాయాధికారికి పోసాని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల