తెలంగాణ, 8 మార్చి (హి.స.)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్దేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ఇందిరామహిళాశక్తి కార్యక్రమం నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ వైపు ఉన్న దారు ల్లో ఆంక్షలు విధిస్తున్నామని, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటలవరకు ఈ ఆంక్షలు వర్తిసాయని పేర్కొన్నారు. టివోలి క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్స్ వరకు మీటింగ్ సమయంలో రోడ్డు బంద్ చేస్తామని, వాహనదారులు పంజాగుట్ట-గ్రీన్ ల్యాండ్స్-బేగంపేట-సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షల సమయంలో ప్రయాణించవద్దని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్