ఉమెన్స్ డే సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ అకౌంట్ ను ఆపరేట్ చేస్తున్న మహిళలు.
న్యూఢిల్లీ., 8 మార్చి (హి.స.) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ను మహిళలు ఆపరేట్ చేస్తున్నారు. వుమెన్ అచీవర్స్ ఆ అకౌంట్లో పోస్టు చేస్తున్నారు. ఇండియన్ చెస్ గ్రాండ్మాస్టర్ ఆర్ వైశాలి, సైంటిస్టులు ఎలీనా మిశ్ర
ప్రధాని మోదీ ఎక్స్ అకౌంట్


న్యూఢిల్లీ., 8 మార్చి (హి.స.)

అంతర్జాతీయ మహిళా

దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ను మహిళలు ఆపరేట్ చేస్తున్నారు. వుమెన్ అచీవర్స్ ఆ అకౌంట్లో పోస్టు చేస్తున్నారు. ఇండియన్ చెస్ గ్రాండ్మాస్టర్ ఆర్ వైశాలి, సైంటిస్టులు ఎలీనా మిశ్రా, షిల్పీ సోనీలు .. ప్రధాని మోదీ అకౌంట్ నుంచి ట్వీట్స్ చేశారు. ప్రధాని ఎక్స్ అకౌంట్లో పోస్టు చేయడం థ్రిల్గా ఉందని ఆ వుమెన్ అచీవర్స్ పేర్కొన్నారు. వనక్కం.. నేను వైశాలి.. ప్రధాని మోదీ సోషల్ మీడియా అకౌంట్ను ఆపరేట్ చేస్తున్నట్లు చెస్ క్రీడాకారిణి తెలిపారు. దేశం తరపున ఎన్నో టోర్నీలు ఆడానని, దాని పట్ల గర్వంగా ఉందన్నారు. ఆరేళ్ల ప్రాయం నుంచి చెస్ ఆడుతున్నట్లు చెప్పింది. లెర్నింగ్, థ్రిల్లింగ్, రివార్డింగ్ జర్నీలా ఉందని పేర్కొన్నది. యువ అమ్మాయిలకు ఆమె సందేశం ఇచ్చారు. ఎన్ని అవరోధాలు వచ్చినా.. కలలను వీడవద్దు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande