ముంబై, 8 మార్చి (హి.స.)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం -సందర్భంగా ఇవాళ మహిళా సిబ్బందితో కూడిన వందేభారత్ రైలును నడిపారు. ముంబైలోని సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ నుంచి షిర్డికి ఆ రైలు ప్రయాణించింది.ఆసియా తొలి మహిళా లోకో పైలెట్ సురేఖా యాదవ్, అసిస్టెంట్ లోకో పైలెట్ సంగీత కుమారి ఆ రైలుకు డ్రైవర్లుగా విధులు నిర్వర్తించారు.ఇవాళ ఉదయం 6.20 నిమిషాలకు ఆ రైలు బయలుదేరింది. రైల్వేశాఖలో మహిళల పాత్ర పెరుగుతోందన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు నడిపిన ఈ రైలులో.. టీటీఈలు అందరు కూడా మహిళలే ఉన్నారు. హెడ్ టికెట్ ఎగ్జామినర్ అనుష్కా కేపీ, ఎంజే రాజ్పుత్, సీనియర్ టికెట్ ఎగ్జామినర్ సారికా ఓజా, సువర్ణా పాస్తే, కవితా మారల్, మనిషా రామ్ ఈ రైలులో విధులు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..