న్యూఢిల్లీ: 8 మార్చి (హి.స.)దేశరాజధానిలోని మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించే 'మహిళా సమృద్ధి యోజన' (Mahila Samridhi Yojana) పథకానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) శనివారంనాడు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు. మహిళా సంక్షేమం, మహిళా భద్రతకు తాను పనిచేస్తానని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో పింక్ టాయిలెట్లు నిర్మిస్తామని ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు