ముంబై,, 8 మార్చి (హి.స.)మహారాష్ట్ర ఎస్పీ అధ్యక్షుడు అబూ అజ్మీ.. మొఘల్ చక్రవరి ఔరంగజేబ్ గొప్ప పాలకుడని, క్రూరుడు కాదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వివాదం ముదరడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందువల్ల ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారు. చరిత్రకారులు, రచయితలు ఔరంగజేబ్ రహ్మతుల్లా అలి గురించి ఏమి చెప్పారో అదే తానూ చెప్పానని వివరణ ఇచ్చారు.
అబూ అజ్మీ క్షమాపణలు చెప్పిన ప్రజల కోపం ఆగడం లేదు. ఆ ప్రకటన తర్వాత.. పలువురు హిందువులు, సాధువులు ఔరంగజేబు సమాధిని బుల్డోజర్‌తో కూల్చేశాయాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్ నగరంలోని శివాజీ చౌక్ వద్ద ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఔరంగజేబు లాంటి క్రూరమైన పాలకుడి సమాధి తొలగించనంత వరకు హిందువులు మౌనంగా కూర్చోరని చెబుతున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు