ఇండియా vs న్యూజిలాండ్.. రూ.5వేల కోట్లకుపైగా బెట్టింగ్‌
ముంబై, 9 మార్చి (హి.స.)ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025) ఫైనల్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ జట్లు దుబాయ్‌ వేదికగా నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై భారీ ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు నిఘావర్గాలు పసిగట్టాయి. వీటి వి
ఇండియా vs న్యూజిలాండ్.. రూ.5వేల కోట్లకుపైగా బెట్టింగ్‌


ముంబై, 9 మార్చి (హి.స.)ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025) ఫైనల్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ జట్లు దుబాయ్‌ వేదికగా నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై భారీ ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు నిఘావర్గాలు పసిగట్టాయి. వీటి విలువ దాదాపు రూ.5వేల కోట్లకు పైగా ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇటీవల దిల్లీ క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు భారత్‌-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్ సమయంలో బెట్టింగ్‌లకు పాల్పడిన కొందరిని అరెస్టు చేశారు. ల్యాప్‌టాప్స్, మొబైల్స్‌లో లైవ్‌లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారు అధికారులకి దొరికిపోయారు. తాజాగా వీరి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వెబ్‌సైట్‌లో మాస్టర్‌ ఐడీని ఉపయోగించి వీటిని నిర్వహిస్తున్నారు. ఒక్కో లావాదేవీపై 3 శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కొందరు రూ.35 వేలు అద్దె చెల్లించి ఇళ్లు తీసుకొని వాటిని బెట్టింగ్‌ కేంద్రాలుగా మార్చేస్తున్నట్లు వెల్లడించారు. ఫోన్ల సాయంతో ఆఫ్‌లైన్‌లో కూడా పందేలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande