హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా
తెలంగాణ, హైదరాబాద్. 9 మార్చి (హి.స.) ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్
బీసీ సంఘం ధర్నా


తెలంగాణ, హైదరాబాద్. 9 మార్చి (హి.స.)

ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద

ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ నిర్వాహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు.. ప్రజల ఆస్తులు. వీటిని ప్రజల అవసరాలకు అనుగుణంగా పేదల ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు హాస్టల్, స్కూల్స్ నిర్మాణాలకే ఉపయోగించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande