ఈ నెల 11వ తేదీన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం.
తెలంగాణ, 9 మార్చి (హి.స.) బీఆర్ఎస్ పార్టీ తాజాగా కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన, తెలంగాణ భవన్లో ఈ సమావేశం ఉంటుందని
బి ఆర్ఎస్ మీటింగ్


తెలంగాణ, 9 మార్చి (హి.స.)

బీఆర్ఎస్ పార్టీ తాజాగా కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన, తెలంగాణ భవన్లో ఈ సమావేశం ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గత బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ తర్వాత మళ్లీ హాజరుకాలేదు. అయితే.. ఈ బడ్జెట్ సమావేశాలకు మాత్రం ఆయన హాజరుకావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande