తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 9 మార్చి (హి.స.)
నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ
నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకే దుశ్చర్యలకు పాల్పడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఆదివాసీ ప్రజలు తమ జీవనం సాగించడానికి నిత్యం సంచరించే ప్రదేశాలలో మందు పాతరలను అమర్చుతూ వారు ప్రాణాలు కోల్పోయే విధంగా మూర్ఖపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
అమాయకపు ఆదివాసీ ప్రజల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న మావోయిస్టుల తీరును ఎస్పీ తీవ్రంగా ఖండించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్