ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చేరిన ఉపరాష్ట్రపతి..జగదీప్ ధనఖడ్
న్యూఢిల్లీ, 9 మార్చి (హి.స.) ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ చేరారు. కార్డియాలజీ విభాగం హెడ్ డాక్టర్ డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధనఖడ్కు క్రిటికల్ కేర్ యూనిట్ (స
ఉపరాష్ట్రపతి


న్యూఢిల్లీ, 9 మార్చి (హి.స.)

ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ చేరారు.

కార్డియాలజీ విభాగం హెడ్ డాక్టర్ డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధనఖడ్కు క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయు)లో అందిస్తున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా.. ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా ఆసుపత్రికి వచ్చి ఆయన హెల్త్ కండిషన్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande