బెంగళూరు:, 9 మార్చి (హి.స.)బంగారం అక్రమ రవాణా కేసు (లో కన్నడ నటి రన్యారావు ) కేసు కీలక మలుపు ) తిరిగింది.కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది.ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. దాంతో వారు త్వరలోనే రన్యారావును విచారించే అవకాశం ఉంది. అలాగే దేశంలోని వివిధ విమానాశ్రయాల ద్వారా విదేశాల నుంచి ఇండియాలోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న స్మగ్లర్లపై కేసు నమోదు చేసింది. రన్యారావు అరెస్టు వెలుగులోకి రావడంతో మరిన్ని స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు అక్రమంగా ఇండియాకు బంగారం తరలించే అవకాశాలపై సీబీఐని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అప్రమత్తం చేసిన నేపథ్యంలో సీబీఐ కార్యాచరణకు దిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల