చివరి నిమిషంలో రద్దయిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన
హైదరాబాద్, 9 మార్చి (హి.స.) చివరి నిమిషంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢీల్లీలో అందుబాటులో లేకపోవడంతో సీఎంతో సహా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పర్య
ఢిల్లీ పర్యటన రద్దు


హైదరాబాద్, 9 మార్చి (హి.స.) చివరి నిమిషంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢీల్లీలో అందుబాటులో లేకపోవడంతో సీఎంతో సహా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పర్యటనను రద్దు చేసుకున్నారు.కాగా, కేసీ వేణుగోపాల్ తో మాట్లాడి తిరిగి వారంతా సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వారితో పాటు హస్తినకు వెళ్లనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande