హైదరాబాద్, కర్ణాటక. 9 మార్చి (హి.స.)
రోడ్డు ప్రమాదం లో ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమైన హృదయ విదారక ఘటన కర్ణాటక రాష్ట్రం లో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. భారతీ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రయాణికులతో బెంగళూరు నుంచి ఆధ్యాత్మిక
పుణ్యక్షేత్రమైన తిరుపతి కి బయలుదేరింది.
ఈ క్రమంలోనే బస్సు చింతామణి
వద్దకు రాగానే అతివేగంతో ఎదురుగా వస్తున్న ఓ కారును బలంగా ఢీకొట్టి బోల్తా కొట్టింది. అయితే,ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అందులో ఇద్దరు
అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను
చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా
పోలీసులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..