తెలంగాణ, 9 మార్చి (హి.స.)
హైదరాబాద్ లోని అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు ఆలస్యంపై ఆదివారం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. సుమారు 400 కోట్ల వ్యయంతో అంబర్ పేట ఫ్లైఓవర్ పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబర్పేటలో చేయాల్సిన భూ-సేకరణ ఇంకా చేయకపోవడంతో ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం అవుతుందని ఆరోపించారు. అప్పటికీ.. ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల శ్మశానవాటికకు ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా కేంద్ర రోడ్డు రవాణా శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నట్లు వివరించారు. ఇంత చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ విషయంలో అశ్రద్ధ చేయడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ పనులు పూర్తి చేస్తే, అంత త్వరగా ఫ్లై ఓవర్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ మహాశివరాత్రి రోజు ప్రాంభించిన విషయం తెలిసిందే. అయితే ఫ్లైఓవర్ కింద ఇంకా పనులు జరగాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్