డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో 478 మంది మందుబాబులను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
తెలంగాణ, 9 మార్చి (హి.స.) సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో 478 మంది మందుబాబులను పట్టుకున్నారు. ఇందులో 388 ద్విచక్ర వాహనాలు, 17 త్రిచక్ర వాహనాలు, 70 నాలుగు చక్రాల వాహనాలతో పాటు మరో 3-భారీ వాహనదారుల
సైబరాబాద్ పోలీసులు


తెలంగాణ, 9 మార్చి (హి.స.)

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో 478 మంది మందుబాబులను పట్టుకున్నారు. ఇందులో 388 ద్విచక్ర వాహనాలు, 17 త్రిచక్ర వాహనాలు, 70 నాలుగు చక్రాల వాహనాలతో పాటు మరో 3-భారీ వాహనదారులు ఉన్నారు. ఇందులో 200 ఎంజీ/100 ఎంఎల్ 500 మధ్య రక్తంలో ఆల్కహాల్ సాంద్రతలు ( ( బీఏసీ ) కలిగి ఉన్న 40 మంది నేరస్థులు పట్టుబడ్డారు. అలాగే 500/100 ఎంఎల్ కంటే ఎక్కువ రక్తంలో ఆల్కహాల్ సాంద్రతలు (బీఏసీ ) కలిగి ఉన్న 3 మంది నేరస్థులు పట్టుబడ్డారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే, భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 105 కింద వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. దీనికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుందని పోలీసులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande