యంగ్ ఇండియా స్కూళ్లకు రూ 11,600 కోట్ల రూపాయలు మంజూరు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ, 9 మార్చి (హి.స.) దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా స్కూల్లను రూ.11,600 కోట్లతో మంజూరు చేస్తూ జీవో జారీ చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం వారు హైదరాబాదులో మాట్లాడుతూ.. ఇలాంటి స్కూల్స్ దేశంలో ఎక్కడా లేవన్నారు. 20-25 ఎకరాల్లో అన
డిప్యూటీ సీఎం


తెలంగాణ, 9 మార్చి (హి.స.)

దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా స్కూల్లను రూ.11,600 కోట్లతో మంజూరు చేస్తూ జీవో జారీ చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం వారు హైదరాబాదులో మాట్లాడుతూ.. ఇలాంటి స్కూల్స్ దేశంలో ఎక్కడా లేవన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాఫ్స్ కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు.. డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ లో చదివించలేని పిల్లలకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్ర విద్యారంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయమని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande