నారాయణ ఐఐటి క్యాంపస్ లో ఫుడ్ పాయిజనింగ్. పలువురు విద్యార్థులకు అస్వస్థత
తెలంగాణ, 9 మార్చి (హి.స.) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని నారాయణ ఐఐటి క్యాంపస్ లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే కుంట్లూరులోని నారాయణ ఐఐటి క్యాంపస్ లో ఆదివారం ఉదయం
ఫుడ్ పాయిజన్


తెలంగాణ, 9 మార్చి (హి.స.)

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్

మండలం కుంట్లూరు గ్రామంలోని నారాయణ ఐఐటి క్యాంపస్ లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే కుంట్లూరులోని నారాయణ ఐఐటి క్యాంపస్ లో ఆదివారం ఉదయం చపాతి తో కూడిన ఆలు కూర్మ తినడంతో పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మోషన్స్ వాంతులతో ఇబ్బందులు పడ్డారు. కళాశాల యాజమాన్యం వైద్యులను తీసుకువచ్చి ఓఆర్ఎస్,కొబ్బరి బోండాలతో తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలను చూసుకొనివడం లేదని తమ పిల్లల దగ్గరకు వెళ్లామంటే కోప్పడుతూ తిడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande