ఏ. పీ, 9 మార్చి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 14 లక్షల కోట్ల అప్పులపాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో శాసన సభలో 6 లక్షల 40వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది.. అప్పుల విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అధికార కోసం అబద్ధాలు ఎంచుకున్న నాయకుడు చంద్రబాబు.. ప్లీజ్ రియంబర్స్మెంట్ చేస్తానని విద్యార్థులను మభ్యపెడుతున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష 30 వేల కోట్లు అప్పులు చేశారు.. రాష్ట్రానికి అప్పులు పుట్టవని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇన్ని అప్పులు ఎలా చేశారు.. ఈ విషయాలను ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెల్లుబోయిన వేణు చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..