తెలంగాణ, వేములవాడ. 9 మార్చి (హి.స.)
విద్య, వైద్యం సాగునీటి రంగాలను
అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో దశాబ్దకాలంగా మిగిలిపోయిన పట్టణంలోని తిప్పాపూర్ రెండవ బ్రిడ్జి నిర్మాణం కోసం ఆదివారం రూ.6 కోట్ల 85 లక్షల వ్యయంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భూమి పూజ చేశారు. 2015 సం.లో ఆనాటి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. కానీ పదేళ్లు నిండిన నాయకుల నిర్లక్ష్యం తో పడావ్ పోయిందన్నారు. ఉండి
అనాడు ప్రతిపక్ష హోదాలో నిలదీసి, నేడు భూమి పూజ చేసుకున్నామాన్నారు. నియోజకవర్గంలో మోత్కూరావుపేట - చందుర్తి, కలికోట సూరమ్మ ప్రాజెక్ట్, మర్రిపల్లి ప్రాజెక్ట్, వేములవాడ బ్రిడ్జి నిర్మాణలను పునఃప్రారంభం చేశామని తెలిపారు. వచ్చే వర్షాకాలంలో లోపు వేములవాడ రెండవ బ్రిడ్జి పూర్తి చేస్తామని అన్నారు. రూ. 47 కోట్లతో పట్టణంలో రోడ్ వైండింగ్ పూర్తి చేస్తామని, నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చి, మెప్పించి వైడింగ్ పూర్తి చేస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్