పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. హరీష్ రావు ఆరోపణ..
తెలంగాణ, 9 మార్చి (హి.స.) నిన్న మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్రవు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను అసెంబ్లీలో ఒక ప్రశ్న వే
హరీష్ రావు


తెలంగాణ, 9 మార్చి (హి.స.)

నిన్న మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్రవు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను అసెంబ్లీలో ఒక ప్రశ్న వేస్తే మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారని.. రూ.5 లక్షల ఋణానికి మాత్రమే వడ్డీ లేకుండా ఇస్తున్నాం అని ఆమె చెప్పినట్లు తెలిపారు.

కానీ నిన్న మీటింగ్ లో రూ.21 వేల కోట్లకు వడ్డీ లేని రుణం ఇచ్చామని చెప్పారన్నారు. రూ. 5 లక్షల వరకు మాత్రమే వడ్డీ లేని ఋణం ఇస్తూ... రూ. 10 లక్షల ఋణాలకి కూడా వడ్డీ లేకుండా ఇస్తున్నాం అని మీటింగ్ లో చెప్పారని.. రూ. 21 వేల కోట్లకి ఎక్కడ వడ్డీ లేకుండా ఇచ్చారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande