తెలంగాణ, హైదరాబాద్. 9 మార్చి (హి.స.) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల నివాసితులకు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పరిసర ప్రాంతాల ప్రజలు అఖిలపక్షంగా ఏర్పడి ఆదివారం ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా కాలుష్య బాధితులు వాయు కాలుష్యాన్ని నివారించాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో ఆదివారం బాచుపల్లిలో ఇండస్ట్రియల్ కాలుష్యానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ కాలుష్యానికి, పీసీబీ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఫ్ల కార్డులు చేతబూని నినదిస్తూ నిరసన తెలియజేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్