ఏ.పీ, బాపట్ల, 9 మార్చి (హి.స.) బాపట్ల జిల్లాలోని రేపల్లెలో రూ.8 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాలను ఆదివారం ఉదయం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో విద్యా వ్యాప్తి లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, అవసరమైతే సీఎస్ ఆర్ నిధులు ద్వారా పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అనగాని తెలిపారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి విద్యా రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించారని మంత్రి అన్నారు.
ప్రతి క్లాస్ కి ఒక టీచర్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడంతో పాటు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సమన్వయం కోసం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..