రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని బదనాం చేస్తుంది.. మంత్రి పొన్నం
తెలంగాణ, సిద్దిపేట. 9 మార్చి (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే విమర్శలు మొదలయ్యాయని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బదనాo చేసే ప్రయత్నం చేస్తున్నాయని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కొమరవెల్లి మల్లన్న దర్శన
మంత్రి పొన్నం


తెలంగాణ, సిద్దిపేట. 9 మార్చి (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే విమర్శలు మొదలయ్యాయని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బదనాo చేసే ప్రయత్నం చేస్తున్నాయని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కొమరవెల్లి మల్లన్న

దర్శనం చేసుకున్న ఆయన.. దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రకృతి సహకరించి మంచి సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మల్లన్నను వేడుకున్నానని చెప్పారు. అంతేగాక ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని మల్లన్న ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నదని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande