చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. వచ్చే బడ్జెట్లో చేనేతల రుణాలు మాఫీ.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
తెలంగాణ, హైదరాబాద్. 9 మార్చి (హి.స.)చేనేత కార్మికులకు మంత్రి గుడ్యూస్ చెప్పారు. చేనేతల రుణాలు వచ్చే బడ్జెట్ లో మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన ప్రసంగి
తుమ్మల నాగేశ్వరరావు.


తెలంగాణ, హైదరాబాద్. 9 మార్చి (హి.స.)చేనేత కార్మికులకు మంత్రి గుడ్యూస్ చెప్పారు. చేనేతల రుణాలు వచ్చే బడ్జెట్ లో మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన ప్రసంగించారు. “మీకు నష్టం జరిగే ఏ పని చేయదు. నేతన్నలకు సాయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. కుల గణన విషయంలో రేవంత్ రెడ్డిని చాలా మంది వ్యతిరేకించారు. కానీ రాహుల్ గాంధీ మాట నిలబెట్టేందుకు కుల గణన చేశారు. కుల గణన చేసిన ఏకైక సీఎం రేవంత్.. అలాంటి ప్రభుత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనపై ఉంది. అప్పు తీసుకోవడానికి వెసులుబాటు ఇవ్వకపోయినా... గుండె ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. అని మంత్రి వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande