హౌరా ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం
తిరుపతి, 9 మార్చి (హి.స.) అహ్మదాబాద్ నుంచి హౌరా వెళ్లే హౌరా ఎక్స్ప్రెసు రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు ప్రయాణించే తిరుపతి జిల్లాలోని గూడూరు అడవయ్యకాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగిపోయాయి. ఈ విషయాన్న గమనించిన స్థానికులు రైలు వచ్చే సమయంలో రెడ్
హౌరా ఎక్స్ప్రెస్


తిరుపతి, 9 మార్చి (హి.స.)

అహ్మదాబాద్ నుంచి హౌరా వెళ్లే హౌరా ఎక్స్ప్రెసు రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు ప్రయాణించే తిరుపతి జిల్లాలోని గూడూరు అడవయ్యకాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగిపోయాయి. ఈ విషయాన్న గమనించిన స్థానికులు రైలు వచ్చే సమయంలో రెడ్ క్లాత్ ద్వారా లోకోపైలట్ను అప్రమత్తం చేశారు. దీంతో అతను రైలును ఆపేశాడు. దీనితో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

విరిగిన పట్టాలకు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టిన అనంతరం ఈ మార్గం గుండా నడిచే రైళ్లు అన్ని యధావిధిగా ప్రయాణించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande