విశాఖపట్నం 9 మార్చి (హి.స.) ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హోటల్‌లో ఎన్‌ఆర్‌ఐ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం సంచలనం రేకెత్తించింది. గురువారం ఈ ఘటన జరగ్గా... పోలీసులు గోప్యంగా ఉంచడంతో శనివారం వెలుగులోకి వచ్చింది. సీతమ్మధారకు చెందిన మహిళ(48) అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నగరానికి చెందిన వైద్యుడు శ్రీధర్(52) కూడా అమెరికాలో స్థిరపడ్డారు.
మహిళతో శ్రీధర్‌కు స్నేహం ఉన్నట్లు సమాచారం. నెల కిందట శ్రీధర్ విశాఖ వచ్చి ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఎన్‌ఆర్‌ఐ మహిళ ద్వారకానగర్‌లోని ఓ ప్రైవేటు స్థలం లీజ్ అగ్రిమెంటు చేసుకోవడానికి ఇటీవల అమెరికా నుంచి వచ్చారు. శ్రీధర్ గదిలోనే తానూ ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బాత్రూంలోని షవర్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీధర్ ఫిర్యాదుచేశారని మూడో పట్టణ స్టేషన్ సీఐ రమణయ్య తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల