ప్రాచీన కులవృత్తులు అంతరించిపోకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారం.. ఎమ్మెల్యే వేముల వీరేశం
తెలంగాణ, నల్గొండ. 9 మార్చి (హి.స.) ప్రాచీన కులవృత్తులు అంతరించిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల పై ఆధారపడి జీవించే వారికి సహాయ సహకారాలు అందిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల పట్టణ కేంద్రంలో జరిగిన కుల వృత్తుల
ఎమ్మెల్యే వేముల వీరేశం


తెలంగాణ, నల్గొండ. 9 మార్చి (హి.స.)

ప్రాచీన కులవృత్తులు అంతరించిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల పై ఆధారపడి జీవించే వారికి సహాయ సహకారాలు అందిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల పట్టణ కేంద్రంలో జరిగిన కుల వృత్తుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రాచీన కాలం నుండి సమాజంలో భాగంగా కొనసాగుతున్న కులవృత్తులు నేటి ఆధునిక కాలంలో అంతరించిపోయే ప్రమాదం ఉందని వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

కులవృత్తులు అంతరించిపోకుండా వాటి పై ఆధారపడి జీవించే వారికి తగిన ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందజేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే కులవృత్తులు ఆచరించే ప్రతి ఒక్కరూ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande