హైదరాబాద్, 9 మార్చి (హి.స.), : చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రత్యేక రైళ్లు పరుగుపెడుతున్నా... ఎంఎంటీఎస్ (MMTS)ల సంఖ్య పెంచకపోవడంపై ప్రయాణికులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో కేవలం రెండు ఎంఎంటీఎస్‌లు మాత్రమే నడుపుతుండటంతో ‘చర్లపల్లికి చేరేదెలా’..? అని ప్రశ్నిస్తున్నారు. ఘట్‌కేసర్- లింగంపల్లి, సనత్‌నగర్-ఘట్‌కేసర్ మార్గంలో రైళ్లు నడుపుతున్నా... డిమాండ్ ఉన్న సమయాల్లో నడపకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల