హైదరాబాద్, 9 మార్చి (హి.స.) ఇండస్ట్రీయల్ ఏరియాగా పేరున్న సంగారెడ్డి జిల్లా లింగపల్లిలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు గాను సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో బీహెచ్ఎఎల్ జంక్షన్ వద్ద కొత్త ఫ్లైఓవర్ నిర్మించారు. మొత్తం రూ.130.65 కోట్ల వ్యయంతో 1.65 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ మరో వారం రోజుల్లో వాహనదారులకు అందుబాటిలోకి రానుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 2022లో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించగా.. తాజాగా పనులు పూర్తయ్యాయి.
ఇప్పటికే ఫ్లైఓవర్పై తాత్కాలికంగా వాహనాలకు ఎంట్రీ ఇచ్చారు. త్వరలో బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..